ప్రీతీజింతా సోదరుడు నితిన్ ఆత్మహత్య
- December 03, 2016
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్ లో సెట్ అయిన ప్రీతీజింతా సోదరుడు నితిన్ చౌహాన్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రీతిజింతా కజిన్ సోదరుడైన నితిన్ చౌహాన్ గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే భార్య, అత్త, మామల వేధింపులు తాళలేక శుక్రవారం సిమ్లాలో తన కారులో గన్ తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు నితిన్ కారులోనూ, ఇంట్లో నాలుగు పేజీల రెండు సూసైడ్ నోట్లు లభించాయి. అందులో భార్య, అత్త, మామల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టి కన్నకొడుకుని కూడా చూడనివ్వలేదని సూసైడ్ నోట్లో నితిన్ తెలిపాడు. దీంతో భార్య, అత్త, మామలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే కోర్టులో దాఖలు చేసుకున్న విడాకుల కేసుకు సంబంధించి విచారణ శుక్రవారమే జరగాల్సి ఉంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







