కంటి కింద ఉబ్బటానికి గల కారణాలు
- December 03, 2016
సెల్యూలైటీస్, ఊబకాయం వంటివి వాటి వలన మన శరీరంలో కొవ్వు పదార్థాలు పెరుకుపోతుంటాయి. ఇవే కాదు, కంటి కింద బ్యాగుల వలే వచ్చే వాటికీ కూడా కొవ్వు పదార్థాలే కారణం. దీనిని వైద్యపరంగా క్యాంథస్ లేదా క్షాంతెలేస్మా అంటారు.
తెలుగులో మీ కళ్ళు చుట్టూ కన్ను సంచులు కోసం రెమిడీస్
కారణాలు
ఈ ప్రాంతంలో చెడు లేదా తక్కువ సాంద్రత గల కొవ్వు పదార్థాలు పేరుకుపోతాయి. మధుమేహం, అరక్తంలో అధిక చక్కెర స్థాయిలు, కాలేయ వ్యాధులు మరియు ఇతరేతర రుగ్మతలు వంశపారంపర్యంగా సంక్రమించటం వలన ఇవి కలుగుతాయి.
శరీరంలో అధిక కొవ్వు పదార్థాలు కలిగి ఉన్నచో, ఇలాంటివి కలిగే అవకాశం ఉంది. అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు కంటి కింద పైన పేరుకుపోవటం వలన ఇవి కలుగుతాయి మరియు దీని వలన రాను రాను చూపు మందగిస్తుంది.
ఇలాంటి పరిస్థితులలో ప్రత్యామ్నాయ చికిత్సలుకు కూడా సహాయపడతాయి. కొన్ని రకాల ఔషదాలను వాడటం ద్వారా క్షాంతెలేస్మాను తగ్గించుకోవచ్చు. ఆ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
ఉల్లిపాయ
ఉల్లిపాయ నుండి రసాన్ని సేకరించి, కొద్దిగా ఉప్పు కలపండి. కొన్ని గంటల పాటూ దీన్ని అలాగే పక్కన ఉంచండి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. మరుసటి రోజు చల్లటి నీటితొ కడగండి. ఉల్లిపాయలో ఉండే సమ్మేళనాలు కొవ్వు పదార్థాలు పెరుకుపోవటాన్ని నిలిపివేస్తాయి.
వెల్లుల్లి
వెల్లుల్లిని దంచి పేస్ట్ వలే చేసి, ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. అలా అరగంట పాటూ ఉంచి చల్లటి నీటితో కడిగి వేయండి. మీ చర్మం సున్నితంగా ఉంటే మాత్రం ఎక్కువ సమయం పాటూ, ఈ పేస్ట్ ను చర్మంపై ఉంచకండి. వెల్లుల్లిలో ఉండే ఎంజైమ్ కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ లో నాన్చండి మరియు ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. తీవ్రమైన ఆమ్ల గుణాలను కలిగి ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ మచ్చలను తొలగిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించుటకు గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగవచ్చు.
క్యాస్టర్ ఆయిల్
క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదం నూనెలో ఉండే 'రిసినోఎలిక్ ఆసిడ్' పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను తొలగిస్తుంది. కాటన్ బాల్ ను దీనిలో నాన్చి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. మంచి ఫలితాలను పొందటానికి రోజు ఈ పద్దతిని అనుసరించండి.
మెంతులు
ఒక గ్లాసు నీటిని, రెండు చెంచాల మెంతి విత్తనాలకు అప్లై చేయండి. వీటిని అలాగే ఒక రాత్రి వరకు నీటిలో నానబెట్టండి, తరువాత ఉదయాన ఖాళీకడుపుతో అలాగే తాగండి. చెడు కొవ్వు పదార్థాలను మరియు శరీరంలో పెరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







