థియేటర్లలో పాత 500, 1000 నోట్లు తీసుకునేందుకు అనుమతివ్వాలి--మన్సూర్
- December 04, 2016
తమిళ సినిమాలో మన్సూర్ ఆలీఖాన్ భిన్నమైన నటుడిగా పేర్కొనవచ్చు. రీల్‌పై ప్రదర్శించే నటనగానీ, రియల్‌గా ప్రవర్తించే విధానంలో గానీ ఇతర నటులకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారన్న పేరు ఉంది. ఈ మధ్య విలన్ వేషాలు తగ్గించి సొంత బ్యానర్లో హీరోగా నటిస్తున్న మన్సూర్ తాజాగా కొత్త ప్రతిపాదనతో మీడియా ముందుకొచ్చారు. థియేటర్లలో పాత 500, 1000 నోట్లు తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చెన్నైలోని ఆర్కేవీ స్టూడియోస్‌లో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ప్రధాని మోదీ నోట్ల రద్దు ప్రకటన తరువాత దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయడం తప్పనడం లేదు.
అయితే ఈ ప్రయత్నం నల్లకుబేరులు ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. సామాన్య ప్రజలే బాధపడుతున్నారు. సినీపరిశ్రమకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి. థియేటర్లు మూసివేసే పరిస్థితి నెలకొంది.
పెద్ద నోట్లు చెలామణీ పూర్తిగా నిలిపివేసే మార్చి 31వ తేదీ వరకు థియేటర్లలో పాత 500, 1000 నోట్లు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరుతున్నాను' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







