కాలిఫోర్నియా లో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది మృతి
- December 04, 2016
అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో ఒక వీకెండ్ పార్టీ జరుగుతున్న భవనంలో మంటలు చెలరేగడంతో 40 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రెండు అంతస్థులలో ఉన్న ఈ భవనాన్ని ఒక కళాకారుడు తాను సేకరించిన పెయింటింగులను దాచుకోడానికి గోడౌన్‌గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో మంటలు చెలరేగడంతో మొత్తం భవనం అంతా బూడిద కుప్పగా మారింది. అందులోంచి సుమారు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. అగ్నిప్రమాదం ఎందువల్ల సంభవించిందో ఇంకా తెలియలేదు. ఇందులో విద్రోహచర్య ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఈ భవనంలో తరచు సంగీత ప్రదర్శనలు కూడా జరుగుతుంటాయని, కానీ భవన నిర్మాణంలో నిబంధనలను మాత్రం అస్సలు పాటించలేదని అంటున్నారు.
ఆల్మెడా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఇప్పటికే అగ్నిప్రమాదానికి సంబంధించిన నేర విచారణను ప్రారంభించిందని మేయర్ లిబ్బీ స్కాఫ్ తెలిపారు. బాధితులు ఎవరో గుర్తించడం, వాళ్ల కుటుంబాలకు సమాచారం అందించడం తమ ప్రథమ కర్తవ్యమని మేయర్ చెప్పారు. ఏడు కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. ఈ ప్రమాదం సరిగే సమయానికి భవనంలో ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియలేదు. గతంలో 2003 సంవత్సరంలో రోడ్ ఐలండ్ నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మంది మరణించారు. దాని తర్వాత జరిగిన అతిపెద్ద ప్రమాదం ఇదేనని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







