మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం!
- December 07, 2016
జర్మనీలో ఇకపై ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం విధించనున్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(సీడీయూ) పార్టీ అధ్యక్షురాలిగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముస్లిం మహిళలు ధరించే బుర్ఖా అంశాన్ని ప్రస్తావించారు. జర్మనీలో మహిళలు ముఖం కనిపించకుండా ఉండేందుకు ధరించే బుర్ఖాను ఇక అంగీకరించబోమని, అలా ధరించడం చట్టబద్ధం కూడా కాదని మెర్కెల్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. .ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మహిళలు ధరించే బుర్ఖాపై నిషేధం విధించాలనే డిమాండ్కు ఆగస్టులోనే ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి థామస్ డి మైజెర్ మద్దతిచ్చారు.సమాజంలోని పరిస్థితులు, సంబంధాలకు అది సరిపోదని అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గతంలో ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







