పెరిగిన ఆయిల్ ధరలు
- December 09, 2016
వరుసగా రెండో రోజు క్రూడ్ ఆయిల్ ధరలు పైకి ఎగిశాయి. ఒపెక్, ఇతర దిగ్గజ ఉత్పత్తిదారుల మధ్య ఆయిల్ ఉత్పత్తిలో కోతపై సమావేశం జరుగనున్న నేపథ్యంలో క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలోనే బంగారం ధరలు కిందకి పడిపోయాయి. వియెన్నాలో శనివారం ఒపెక్ దేశాలు, నాన్ ఒపెక్ 14 దేశాల మధ్య భేటీ జరుగబోతోంది. వీరిమధ్య చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్యారెల్ క్రూడ్ ధర సమారు 51 డాలర్లకు ఎగిసినట్టు విశ్లేషకులు చెప్పారు.. ఇప్పటికే ఒపెక్ సభ్యులు ఉత్పత్తికోతలో ఓ అంగీకారానికి రాగా, నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో 0.6 మిలియన్ బ్యారెళ్లు కోత విధించనున్నట్టు తెలుస్తోంది.
ఆయిల్ మార్కెట్ సమతుల్యం కోసం ఒపెక్ సభ్యులు 2008 తర్వాత మొదటిసారి ఉత్పత్తిలో కోత విధించనున్నట్టు ప్రకటించారు.ఒకవేళ నాన్ ఒపెక్ సభ్యులు కూడా ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు చెబితే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ధరలు 60 డాలర్లకు వచ్చిన సందేహం లేదని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి మంచి వారంగా నమోదవుతున్న ఆసియా ఈక్విటీ స్టాక్స్ చివరిలో హెచ్చుతగ్గులకు గురయ్యాయి. బాండ్లు, కొరియన్ ఓన్ పడిపోగా, డాలర్ బలపడింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







