వింటర్లో శరీరానికి కావలసిన ఎనర్జీకి విటమిన్ సి ఫ్రూట్స్ తీసుకోవాలి...
- December 09, 2016
శీతాకాలంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవాలి. శీతాకాలంలో దానిమ్మను తీసుకోవచ్చు. దానిమ్మను అలాగే తీసుకోవడం లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవడం వంటివి చేయొచ్చు. ఇది క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను పూర్తిగా కలిగివుండే ఈ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చును.
అలాగే సి విటమిన్ ఫ్రూట్స్ గల నిమ్మ, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్, కివి ఫ్రూట్స్, టాంగరీన్స్ వంటివి తీసుకోవాలి. టాంగెరీన్స్ తీసుకోవడం ద్వారా వింటర్లో ఏర్పడే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే వింటర్లో శరీరానికి కావలసిన ఎనర్జీ లభించాలంటే నిమ్మ, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిందే. అయితే ఫ్రూట్ జ్యూస్ తీసుకునేటప్పుడు వేడి చేసిన నీటిని చల్లార్చి వాటితో తయారు చేసిన జ్యూస్‌లను తీసుకోవడం మంచిది. అలాగే రాత్రిపూట కాకుండా మధ్యాహ్నం పూట పండ్లను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







