అమరావతి రాజధాని నగరంలో జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు
- December 09, 2016
అమరావతి రాజధాని నగరంలో జాతీయస్థాయి ప్రముఖ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సీఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలతో యూనివర్సిటీల ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు డౌనలోడింగ్ చేసుకొని కొత్త సంవత్సరంలో జనవరి నాల్గో తేదీ లోపు సీల్డ్ కవర్‌లో తమ స్పందనను తెలియజేయాలని కోరింది.
ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకొన్న విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి అమరావతిలో క్యాంపస్‌లు ప్రారంభించేందుకు ఒప్పించింది. ఎకరం రూ.50 లక్షలకు భూములు కేటాయిస్తోది. యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపు, అనుమ తులన్నింటిని ఇప్పించేందుకు సీఆర్‌డీఏలో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. జాతీయస్థాయిలో బిట్స్ పిలాని, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స బెంగళూరు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తేజ్‌పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఇండియన ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స అండ్ టెక్నాలజీ గుర్తింపు పొందాయి.వీటిని కూడా అమరావతికి తీసుకురావడమే లక్ష్యంగా సీఆర్‌డీఏ ఆహ్వానాలు పలుకుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







