ఖతార్ మార్కెట్లో డిజెర్ట్ ట్రఫెల్స్
- December 10, 2016
డిజర్ట్ ట్రఫెల్స్ని స్థానికంగా ఫగ్గా అని పిలుస్తారు. రీజియన్‌లో తొలి థండర్‌స్టార్మ్స్ తర్వాత వీటి రాక మార్కెట్లలోకి జోరందుకుంది. ఫగ్గాకు ఉండే ప్రత్యేకతల కారణంగా వీటి ధర ఎలా ఉన్నా, అమ్మకాలు మాత్రం బాగా జరుగుతుంటాయని ఒమన్ సౌక్ వెండర్స్ చెబుతుంటారు. వీటిల్లో న్యూట్రిషనల్ అలాగే మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ. బ్రౌన్ మరియు వైట్ ఫగ్గా తమ వద్ద అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని అల్జీరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామని ఒమని సౌక్‌లోని ఓ ఫగ్గా వెండర్ చెప్పారు. పొటాటో తరహాలో ఇవి కనిపిస్తాయి. ఒక్కో బాక్స్‌ని ముందుగా 1,200 ఖతారీ రియాల్స్‌కి అమ్మడం జరిగిందనీ, బ్రౌన్ రకం 450 ఖతారీ రియాల్స్‌కి అమ్మడం జరిగిందనీ చెప్పారు అమ్మకందారులు. వీటిల్లో రకాల్ని బట్టి ధరలు ఉంటాయి. ఒక్కోసారి వీటి ధర ఒక కిలో 3,000 ఖతారీ రియాల్స్ కూడా ఉండవచ్చు. వీటిల్లో ఖతారీ ఫగ్గా అతి ఖరీదైనది. గత ఏడాది ఖతారీ ఫగ్గా 1,500 నుంచి 2,000 ఖతారీ రియాల్స్ వరకూ ధర పలుకుతుంటుంది. మొరాకోలో టెర్ఫెజియా, ఈజిప్ట్‌లో టెర్ఫాజ్గా పిలుస్తారు. కువైటీలు ఫగ్గా అని పిలుస్తారు. ఒమన్‌లో ఫగా లేదా జుబైది అని, యూఏఈలో ఫగా, ఇరాక్‌ల, సిరియా, సౌదీ అరేబియాల్లో కమాగానూ పిలుస్తారు. సలాడ్స్‌లోనూ, పాలల్లోనూ, బట్టర్లోనూ వినియోగిస్తారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







