చికెన్ మిలాప్
- December 10, 2016
కావలసినవి బోన్‌లెస్ చికెన్ ముక్కలు 2 కప్పులు, బీన్స్ 150 గ్రా, గ్రేవీ కోసం: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు ఒక టీ స్పూను, అల్లం ఒక టీ స్పూను, చాట్ మసాలా ఒక టీ స్పూను, కారం అర టీ స్పూను, పసుపు అర టీ స్పూను, గరం మసాలా పొడి అర టీ స్పూను, టొమాటో ప్యూరీ అర కప్పు, ఎండు మెంతి ఆకులు అర టీ స్పూను, చితక్కొట్టిన నల్ల మిరియాలు అర టీ స్పూను, (తరిగిన) టొమాటోలు 2, ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
చికెన్ ముక్కల్ని శుభ్రం చేసి ఉప్పు, కారం పట్టించి పది నిమిషాలు ఉంచాలి. బాణలిలో నూనె వేడి చేసి అల్లం, వెల్లుల్లి వేగించాలి. ఆ తర్వాత గ్రేవీ కోసం సిద్ధం చేసుకున్న మిగతా వాటినన్నిటినీ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోయాలి. తర్వాత చికెన్ ముక్కల్ని వేసి కలిపి బాగా ఉడికించాలి. ఆ తర్వాత మీడియం సైజులో కట్ చేసిన బీన్స్‌ని కూడా వేసి మరో 7 నిమిషాలు ఉడికించాలి. దీనిని వేడి వేడిగా అన్నంతో గాని, చపాతీలతో గాని తింటే చాలా బాగుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







