టర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది....
- December 10, 2016
టర్కీ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. ముఖ్య నగరమైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి సంభవించిన జంట పేలుళ్లలో 29 మంది మృతిచెందగా.. 166 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ తెలిపారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు వెల్లడించారు. తొలి పేలుడు ఫుట్‌బాల్ స్టేడియం బయట.. రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి దాడిలో కారు బాంబును దుండగులు వినియోగించగా.. రెండో ఘటనలో ఆత్మహుతి దాడిగా పోలీసులు భావిస్తున్నారు.ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం అభిమానులంతా ఇళ్లకు చేరుకున్న తర్వాత పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం తగ్గిందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







