ఒంటెలకు లైసెన్స్‌లు....
- December 11, 2016
ఎలాంటి వాహనాలకైనా రిజిస్ట్రేషన్.. నెంబర్‌ప్లేట్ తప్పనిసరి. వాహనం.. వాహన యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు రిజస్ట్రేషన్‌లో పొందుపరుస్తారు. ఎప్పుడైనా ఆ వాహనం చోరీకి గురైనా.. ప్రమాదం జరిగినా వాహన నంబర్ ప్లేట్ ద్వారా వాహన యజమానిని గుర్తిస్తారు. అయితే.. ఇరాన్‌లో వాహనాలకే కాదు ఒంటెలకు కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్.. రిజిస్టర్డ్ లైసెన్స్ ప్లేట్(నెంబర్‌ప్లేట్) కేటాయిస్తోంది.ఇరాన్ వంటి దేశాల్లో ఒంటెలు అధికంగా ఉంటాయి. రోడ్లపై వాహనాలతో సమానంగా తిరుగుతుంటాయి. వీటి వల్ల బలూచిస్థాన్ ప్రావిన్స్.. ఆఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయట.కొన్ని ఒంటెలు దారి తప్పి.. మరికొన్ని పారిపోయి రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయట. దీంతో అక్కడి అధికారులు ఒంటెలను.. వారి యజమానుల్ని గుర్తించేలా వాటికి రిజిస్ట్రేషన్ చేసి లైసెన్స్ ప్లేట్లు కేటాయించాలని నిర్ణయించింది. మొదటి విడతలో ఇప్పటికే లక్ష ఒంటెలకు నంబర్ ప్లేట్లు కేటాయించారు. మరో 35వేల ఒంటెలకు లైసెన్స్‌లు కేటాయించే పనిలో ఉన్నారు.దీని ద్వారా ప్రమాదానికి గురైన ఒంటెలను పట్టుకుని వాటి యజమానులకు సమాచారం ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







