మొగదిషులో ఆత్మాహుతి దాడి... 16 మంది మృతి
- December 11, 2016
సోమాలియా రాజధాని మొగదిషులో ఆదివారం ఉదయం ఆత్మాహుతి దాడి సంభవించింది. ఈ పేలుడు ధాటికి 16 మంది మృతి చెందగా, 48 మంది గాయపడినట్లు అక్కడి అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు ఏఎంఐఎన్ అంబులెన్స్ సర్వీస్ డైరెక్టర్ అబ్దికదర్ అబ్దిరహమాన్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించి బాధ్యత వహిస్తూ ఎవరూ ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







