రస్ అల్ ఖైమాలో అగ్ని ప్రమాదం: మహిళ మృతి
- December 11, 2016
రస్ అల్ ఖైమా: 57 ఏళ్ళ మహిళ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఘటన రస్ అల్ ఖైమాలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వారి కుమారుడు చిన్న గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రస్ అల్ ఖైమా పోలీస్ డిప్యూటీ చీఫ్ బ్రిగేడియర్ అబ్దుల్లా అల్ హదిది మాట్లాడుతూ, పోలీసు మరియు సివిల్ డిఫెన్స్, ఉదయం 7.30 నిమిషాలకు అందిన ఎమర్జన్సీ కాల్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేసినట్లు తెలిపారు. బాధితులు నివసిస్తున్న విల్లాలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని రస్ అల్ ఖైమా పోలీసులు వెలికి తీసే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







