150 మృతదేహాల కోసం తెలుగుప్రజల ఎదురుచూపు..
- December 11, 2016
సౌదీ అరేబియాలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది కార్మికుల మృతదేహాలు ఏడాది కాలంగా మార్చూరీల్లోనే మగ్గుతున్నాయి. దీంతో వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మృతులను కడచూపునకు నోచుకోక ఆవేదన చెందుతున్నారు. మృతులకు అంత్యక్రియలు చేయడం కోసం వారు కళ్లల్లో వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకొని సౌదీ అరేబియా వెళ్లిన మన తెలుగు కార్మికుల్లో 150 మంది అనారోగ్యం, ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల కారణాల వల్ల మృత్యువాత పడ్డారు.
వారి మృతదేహాలు ఏడాది దాటినా ఇంకా స్వదేశానికి రాలేదు. మార్చూరీల్లోని మృతదేహాలను స్వదేశానికి తరలించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖాదికారులు రియాద్ లోని భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. మృతదేహాలను పంపించమని రాయబార కార్యాలయం సౌదీలో పనిచేసిన పరిశ్రమల యజమానులకు ఈమెయిల్స్ పెట్టినా, ఫోన్లు చేసినా వారినుంచి స్పందన కొరవడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పదిలక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుండగా వారు అక్కడ మరణిస్తే వారి మృతదేహాలు స్వదేశానికి తీసుకురావాలంటే ఏళ్ల తరబడిగా వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రమాదాల్లో మరణిస్తే వారి మృతదేహాలు స్వదేశానికి తీసుకురావాలంటే కనీసం 40 రోజుల సమయం పడుతుంది. సౌదీ నుంచి ఒక మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలంటే కనీసం 4 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చుఅవుతుందని, అంత డబ్బు వెచ్చించి మృతదేహాన్ని పంపించేందుకు సౌదీలు ముందుకురావడం లేదని ప్రవాస భారతీయ కార్మిక సంఘాల నాయకుడు మంద భీంరెడ్డి చెప్పారు. భారత రాయబార కార్యాలయం అధికారులు సౌదీ పోలీసులు, పరిశ్రమల యజమానులతో మాట్లాడి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మంద భీంరెడ్డి కోరారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







