శాంటాక్లాజ్‌ల వరల్డ్ కప్‌లో గెలిచిన స్వీడన్
- December 14, 2016
ఒలింపిక్స్ పోటీల గురించి అందరికీ తెలుసు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ పోటీల్లో ప్రపంచ దేశాల అథ్లెట్లు పాల్గొంటారు. వికలాంగుల కోసం పారాలింపిక్స్ ఒలింపిక్స్ నిర్వహిస్తారని తెలుసు. మరి శాంటా వింటర్ గేమ్స్ గురించి మీకు తెలుసా? క్రిస్మస్ అంటే మొదటగా గుర్తొచ్చేది శాంటాక్లాజ్. తెలుపు అంచులున్న ఎరుపు రంగు దుస్తులు ధరించి తెల్లటి గడ్డంతో శాంటా తాతయ్య వచ్చి బహుమతులిస్తాడని పిల్లలు ఎదురుచూస్తుంటారు. ఆ శాంటాక్లాజ్‌ల కోసం వరల్డ్ కప్ పోటీలు నిర్వహిస్తారు. వీటిని శాంటా వింటర్ గేమ్స్ అని కూడా పిలుస్తుంటారు. స్వీడన్‌లోని గల్లివర్ అనే పట్టణంలో 2003 నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా గిఫ్ట్‌లను ప్యాక్ చేయడం, క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించడం, డ్యాన్స్ చేయడం, ధృవపు జింకలను తాడు ద్వారా నియంత్రించడం తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో తలపడేందుకు చైనా, హాంకాంగ్, ఫ్రాన్స్, జర్మనీ, కొలంబియా తదితర దేశాల నుంచి శాంటాలు వస్తుంటారు. తాజాగా జరిగిన ఈ శాంటా ఒలింపిక్స్‌లో స్వీడన్ చెందిన శాంటాలు ప్రథమ స్థానంలో నిలిచారు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







