ఆస్కార్ బరిలో ఎ.ఆర్.రెహమాన్
- December 14, 2016
'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి 2009లో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ బరిలో నిలిచారు. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం 'పీలే' బయోపిక్ 'పీలే: బర్త్ ఆఫ్ ఏ లెజెండ్' చిత్రం ద్వారా ఈసారి ఆస్కార్ పోటీలో రెహ్మాన్ చోటు సంపాదించారు. జెఫ్ జింబాలిస్ట్, మైకెల్ జింబాలిస్ట్ ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.ఈసారి 89వ ఆకాడమీ అవార్డులకు ఒరిజనల్ స్కోర్ విభాగంలో 145 మంది పోటీ పడుతున్నారు. పీలేలోని రెహమాన్ కంపోజ్ చేసిన 'గింగా' పోటీలో నిలిచింది. దీనికి సంబంధించి నామినేషన్ల తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేస్తారు.
2011లోనూ రెహమాన్‌కి రెండు ఆస్కార్ నామినేషన్లు లభించాయి. బోయ్లే '127 అవర్స్' సినిమా ఒరిజినల్ స్కోర్‌కి, 'ఇఫ్ ఐ రైజ్' అనే పాటకి ఆయన నామినేట్ అయ్యారు. 2014లో రెహమాన్ హాలీవుడ్ చిత్రాలు 'మిలియన్ డాలర్ ఆమ్', ద హండ్రెడ్ ఫుట్ జర్నీ, భారతీయ సినిమా 'కొచ్చాడయాన్'కు కూడా రెహ్మాన్ పోటీ చేసి ఆస్కార్ బరిలో పోటీ పడ్డారు. అయితే అస్కార్‌ను తీసుకురాలేకపోయారు. 2017 ఫిబ్రవరి 26న 89వ అకాడమీ అవార్డుల ప్రదానం ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







