ఐసీసీ-2016 జట్టులో భారత క్రీడాకారిణి స్మృతి మందన
- December 14, 2016
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మొట్టమొదటిసారి మహిళల విభాగంలో అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా ఐసీసీ-2016 ఉమెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌తో పాటు, వన్డే, టీ20 విభాగాల్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేతల వివరాలను వెల్లడించింది.
12మంది సభ్యులు గల ఐసీసీ-2016 జట్టులో భారత క్రీడాకారిణి స్మృతి మందనకి చోటు దక్కింది. ఈ జట్టుకు వెస్టిండీస్ క్రీడాకారిణి స్టెఫానీ టేలర్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. న్యూజిలాండ్ క్రీడాకారిణి రచెల్ ప్రీస్ట్ వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యారు. అలాగే న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ 2016 సంవత్సరానికి గాను వన్డే, టీ20లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు.
వన్డేల్లో ఈ అవార్డును అందుకోవడం బేట్స్ కెరీర్‌లో ఇది రెండోసారి. ఎనిమిది వన్డేల్లో బేట్స్ 472 పరుగులు చేసింది. 2015 సెప్టెంబరు 14 - 2016 సెప్టెంబరు 20 మధ్య కాలంలో క్రీడాకారిణుల ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించినట్లు ఐసీసీ నిర్వాహకులు తెలిపారు. వన్డే, టీ20 విభాగాల్లో ఒకే సంవత్సరంలో ఒక క్రీడాకారిణి రెండు అవార్డులను(సుజీ బేట్స్) కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







