కొత్త ప్రేమకథ
- December 14, 2016
'గర్ల్‌ఫ్రెండ్' చిత్రంలోని 'ప్రేమెంత పనిచేసె నారాయణ' పాట అప్పట్లో కుర్రకారును ఉర్రూత లూగించింది. ఇప్పుడు అదే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హరికృష్ణ, అక్షిత జంటగా జె.ఎస్.ఆర్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు కెమేరా స్విచాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ''నాగార్జున, శ్రీకాంత్, జగపతిబాబులతో సినిమా చేసిన నేను కొత్తవాళ్లతో చేయడానికి తొలుత భయపడ్డా.కానీ, శివ చెప్పిన కథ నచ్చడంతో మా అబ్బాయి హరికృష్ణను హీరోగా పరిచయం చేసూ నిర్మిస్తున్నా. ఇదొక ప్రేమకథ. ఓ వాస్తవ సంఘటన స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం'' అన్నారు. హరికృష్ణ, అక్షిత, నటి జీవితా రాజశేఖర్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు కరుణాకరన్ తదితరులు ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







