కొత్త భవనాల్లో ఎల్పిజి బ్యాన్!
- December 14, 2016
దుబాయ్: కొత్తగా అప్డేట్ చేసిన యూఏఈ ఫైర్ అండ్ సేఫ్టీ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారంగా చూస్తే కొత్తగా నిర్మించే భవనాల్లో కుకింగ్ గ్యాస్ సిలిండర్లు పూర్తిగా నిషేధం. ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్ని ప్రమాదాల్ని నివారించేందుకోసం ఈ నిబంధనను తెరపైకి తెచ్చినట్లు చెప్పారు. కొత్త భవనాలు సెంట్రలైజ్డ్ గ్యాస్‌పైప్ నెట్వర్క్ని కలిగి ఉంటాయి. అలాంటి భవనాల్లో మళ్ళీ కుకింగ్ గ్యాస్ సిలెండర్ల వాడకం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీమ్, ఈ మేరకు డ్రాఫ్ట్ రూపకల్పనకు నాయకత్వం వహించారు. సివిల్ డిఫెన్స్ అప్పుడే ఈ నిబంధనను అమలు చేసే దిశగా కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ కొత్త కోడ్ ఈ నెల చివరి నాటికి అమల్లోకి వస్తుంది. అయితే పాత భవనాల్లోనూ ఈ నిబంధనలు అమలు చేయడం కొంతవరకు ఇబ్బందికరమనీ, ప్రస్తుత సంప్రదాయ సిలెండర్ల స్థానంలో లైట్ వెయిట్‌తో కూడిన సిలెండర్లను ఉపయోగించడం వల్ల ప్రమాదాల్ని కొంతవరకు తగ్గించవచ్చునని దుబాయ్ సివిల్ డిఫెన్స్‌లో సీనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ చల్లా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







