కార్మిక చట్టాన్ని అతిక్రమించిన 467 మంది కార్మికులు
- December 14, 2016
మస్కట్ : డిసెంబర్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్య కాలంలో 467 మంది కార్మికులు కార్మిక చట్టంను ఉల్లంఘించారని మానవ వనరుల మంత్రిత్వశాఖలోని లేబర్ ఇన్స్పెక్టర్లు కేసులను నమోదు చేశారు, వీరిలో 344 మంది వాణిజ్య కార్మికులు, 53 మంది వ్యవసాయ కార్మికులు మరియు 70 గృహ సంబంధిత కార్మికులు ఉన్నారు. ఈ తనిఖీల సందర్భంగా, 434 మంది కార్మికులను అరెస్టు చేశారు. వీటిలో, 281 మంది కనబడకుండా పారిపోయినవారు కాగా, 135 మంది తగ్గించబడిన కార్మికులు మరియు ౧౮ మందికి పని చేసే పత్రాలు కల్గిలేకపోవడం చేత వీరిని అదుపులో తీసుకొన్నారు. ఇదే సమయంలో అత్యధికంగా కార్మికుల దొరికిన ప్రాంతం మస్కట్ కాగా ఇక్కడ 134 మంది దొరికేరు. ఆ తర్వాత ఉత్తర బతినః లో 122 మంది పట్టుబడ్డారు. వీరందరిపై చట్టపరమైన చర్య తీసుకొనేందుకు అధికారులు ఉపక్రమిస్తున్నారు. మరోవైపు, మంత్రిత్వ శాఖ ఇదే కాలంలో 417 మంది కార్మికులను దేశం నుంచి పంపించివేసింది
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







