నేడు చక్రి ద్వితీయ వర్ధంతి..
- December 14, 2016
పముఖ సంగీత దర్శకుడు గిల్లా చక్రధర్ అలియాస్ చక్రి 15 డిసెంబర్ 2014 న ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్తా టాలీవుడ్ నే కాదు యవత్ సంగీత అభిమానులకు తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించింది. పూరి జగ్నన్నాథ్ డైరెక్షన్ లో జగపతిబాబు హీరో గా వచ్చిన 'బాచి' సినిమాతో టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా పరిచయమైన చక్రి తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు దాదాపు 85 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. చక్రి వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో 1974 జూన్ 15న జన్మించారు. అమ్మ పాటలా కమ్మదనాన్నిస్తూ హాయిని గొలిపేవిధంగా...అదే సమయంలో పాప్ మ్యూజిక్ లా పాటకి తాళం వేసేలా చెయ్యడం ఒక్క చక్రి సంగీతంతోనే సాధ్యమవుతుందేమో అనేలా సినీ జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సంగీతం సమకూర్చిన సత్యం సినిమా చక్రి పాడిన పాటకు ఉత్తమ గాయకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు, 'సింహా' సినిమాకు గానూ నంది అవార్డు వచ్చింది.
చక్రి సమకూర్చిన ఎన్నో పాటల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. నీకళ్ళు పేలిపోను చూడవే అని అమ్మాయిని ఏడిపించినా...నీవే నీవే నేనంటా నీవేలేక నేనే లేనంటా అంటూ అమ్మని లాలించినా...ఏనాటికీ మనమొకటేననీ ఏచీకటీ ఇటు రాలేదని ప్రేయసికి చెప్పినా...జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది అంటూ... ఎద లయలో హత్తుకుపోయే పాటలు మనకందించి ఎంతో ప్రతిభావంతుడిగా పేరుగాంచిన చక్రి చిన్న వయస్సులో అకాల మరణం చెందడం అందరికీ విషాదాన్ని పంచింది. చక్రి మన మధ్యలేరు, కానీ మన సృతుల్లో తన పాటలా చిరంజీవిలా కలకాలం నిలిచిపోతాడు. చక్రి మన నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నా.. సినీజగత్తులో చక్రి స్వరపరచిన సినిమాల పూదోటలో పూచిన పాటల పువ్వుల పరిమళం సినీ సంగీత అభిమానులని రంజింపజేస్తూనే ఉన్నది.. నేడు చక్రి ద్వితీయ వర్ధంతి...పుట్టిన ప్రతిమనిషికి మరణంతప్పదు.. కానీ కొంతమంది మరణించీ చిరంజీవులు..చక్రి తాను స్వరపరచిన పాటల్లో బతికే ఉంటాడు.........
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







