నది మధ్యలో బోట్లో జిమ్...
- December 15, 2016
నది మధ్యలో బోట్లో జిమ్ చేస్తే ఎలా ఉంటుంది. ఆ కిక్కే వేరు. అలాంటి వారి కోసం ప్యారిస్‌లో ఓ స్పెషల్ పడవ రెడీ అవుతోంది. ప్యారిస్‌లోని సీన్ నదిని దాటేందుకు డిజైన్ చేసిన ఈ బోట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయ్యింది. అంతేకాదు ఈ పడవ పెట్రోలు, డీజిల్‌తో కాకుండా... జిమ్ లోపలున్న వాళ్లు సైకిల్ తొక్కితేనే నడుస్తుంది. 20 మీటర్ల పొడవున్న ఈ పడవలో సైకిల్ తొక్కినా... బరువులెత్తినా ఆ శక్తిని ఇవి విద్యుత్తుగా మార్చి బ్యాటరీల్లో నిల్వ చేస్తాయి. ఈ స్పెషల్ జిమ్‌లో ఒకేసారి 45 మంది వరకూ వ్యాయామం చేయొచ్చు. వచ్చే ఏడాది వేసవిలో ఈ పడవ జిమ్‌ను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







