'వీఐపీ 2' కి క్లాప్ కొట్టిన రజినీకాంత్
- December 15, 2016
ధనుష్ కథానాయకుడిగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న 'వీఐపీ 2' చిత్రం షూటింగ్‌ను ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి లత, కథానాయిక అమలాపాల్, నిర్మాత కలైపులి ఎస్ థను, నటుడు వివేక్ తదితరులు హాజరయ్యారు. రజనీకాంత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి, కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తలైవా చిత్ర బృందాన్ని విష్ చేస్తూ ట్వీట్ చేశారు. షూటింగ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో తీసిన ఫొటోలను ధనుష్, సౌందర్య ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
'ఇంతకు మించి నేనేం అడగగలను? ధన్యవాదాలు తలైవా. మీ అందరి ఆశీర్వాదాలతో షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. రఘువరన్ ఈజ్ బ్యాక్' అని ధనుష్ ట్వీట్ చేశారు. అదేవిధంగా సౌందర్య కూడా తల్లిదండ్రులు లత, రజనీకాంత్‌లకు ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆశీర్వాదాలు కావాలని ట్వీట్ చేశారు. 2014లో విడుదలైన 'రఘువరన్ బీటెక్' చిత్రానికి సీక్వెల్‌గా 'వీఐపీ 2'ని తెరకెక్కిస్తున్నారు.


తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







