'ఎస్-3' చిత్రం డిసెంబరు 23కు వాయిదా
- December 15, 2016
సింగం సీక్వెల్‌లో భాగంగా సూర్య కథానాయకుడిగా నటించిన 'ఎస్-3' చిత్రం విడుదల మళ్లీ వాయిదా పడింది. తొలుత డిసెంబరు 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని డిసెంబరు 23కు వాయిదా వేశారు. అయితే మళ్లీ చిత్రం విడుదల తేదీ మారినట్లు హీరో సూర్య ట్వీట్ చేశారు. 'డియర్ ఆల్.. 'ఎస్-3' విడుదల మా పరిధిలో లేని కొన్ని కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది! ఇది ఇంకా మంచే చేస్తుందని నమ్ముతున్నా. మీ అందరి సహకారం కావాలి' అని సూర్య ట్వీట్ చేశారు. .హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటించారు.హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, పెన్ ఇండియా లిమిటెడ్ పతాకాలపై నిర్మించారు. 'ఎస్-3' చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







