బ్రెడ్‌తో ఆనియన్ పకోడీ
- December 15, 2016
శీతాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటుంటాం. అయితే తీసుకునే స్నాక్స్ విషయంలోనూ పోషకాలుండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. ఆనియన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇంకా వచ్చిన రోగాలు సైతం మాయమైపోతాయి. అందుకే ఉల్లిపాయలతో బ్రెడ్ పకోడీలు ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు :
శనగపిండి - రెండు కప్పులు.
జొన్నపిండి - ఒక కప్పు
ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు
బఠాణీ పిండి - అర కప్పు
కొత్తిమీర - అరకప్పు
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
మజ్జిగ - ఒక కప్పు.
బ్రెడ్ - 12 ముక్కలు
ఉల్లి (తురుము) - అరకప్పు
మిర్చి, అల్లం పేస్టు - మూడు టీ స్పూన్లు.
తయారీ విధానం :
ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉల్లితరుగు, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండేయాలి. బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాట సాస్‌లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







