హెచ్1 బీ వీసాల మోసం
- December 17, 2016
హెచ్1 బీ వీసాల మోసం కేసులో హైదరాబాద్ చెందిన టెక్కీ హరి కర్నె అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిగా తేలడంతో న్యాయస్థానం త్వరలో శిక్ష ఖరారు చేయనుంది. అమెరికా కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే ఛాన్స్ వుందని ప్రాసిక్యూటర్ తెలిపారు. నగరానికి చెందిన 32 ఏళ్ల హరి.. యూఎస్‌లో వుంటున్నాడు. కొందరు ఐటీ నిపుణులను ఉద్యోగంలోకి తీసుకుని వాళ్లకి ఎస్సీఎం సిస్టమ్స్‌లో హెచ్1బీ వీసాలను ఇప్పించారు.
వీసాలకు దరఖాస్తు చేసేటప్పుడు వాళ్లకి పూర్తిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని, ఏడాది వేతనాలు ఇస్తామంటూ మభ్యపెట్టాడట హరి. కానీ అలా చేయకుండా.. ఉద్యోగంలోకి తీసుకున్న వాళ్లని మూడో పార్టీకి అప్పగించారు. తర్వాత వీళ్లు సదరు కంపెనీల్లో ఉద్యోగుల పేరిట నకిలీ పే రోల్స్ సృష్టించారు. అంతేకాదు జీతాలు ఇవ్వని రోజుల్లో నకిలీ సెలవు పత్రాలను క్రియేట్ చేశాడు. చివరకు ఈ తతంగమంటూ అమెరికా కార్మికశాఖ తనిఖీల్లో బట్టబయలయ్యింది. దీంతో ఎస్సీఎం ప్రైవేట్ లిమిటెడ్‌లో యూఎస్ ఇమ్మిగ్రేషన్ మేనేజర్‌గా పని చేస్తున్న హరిని అరెస్ట్ చేసి న్యాయస్థానంకి అప్పగించారు.తాను తప్పు చేసినట్టు నిందితుడు కోర్టులో అంగీకరించాడు.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







