జెడ్డా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- December 17, 2016
జెడ్డా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
జెడ్డా: మక్కా గవర్నర్ మరియు కింగ్ సల్మాన్ అడ్వయిజర్ ప్రిన్స్ ఖాలెద్ అల్ ఫైసల్ గురువారం 2వ జెడ్డా అంతర్జాతీయ బుక్ ఫెయిర్‌ని ప్రారంభించారు. జెడ్డా గవర్నర్ ప్రిన్స్ మిషాల్ బిన్ మాజిద్, మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ అదెల్ అల్ తరోయిఫి పలువురు ప్రిన్స్‌లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాంఛనంగా బుక్ ఫెయిర్‌ని ప్రారంభించిన అనంతరం ప్రిన్స్ ఖాలెద్, పెవిలియన్స్‌ని సందర్శించారు. మొత్తం 45 స్థానిక, జిసిసి, అరబ్ మరియు ఇంటర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్‌లు 30 దేశాల నుంచి ఇక్కడ పాల్గొంటున్నాయి. ఈ ఈవెంట్‌ని స్పాన్సర్ చేస్తున్న అలాగే మద్దతిస్తున్న వారిని ప్రిన్స్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మిషాల్, ప్రిన్స్ ఖాలెద్‌ని ప్రశంసించారు. జెడ్డాలో కల్చరల్ మెగా ఈవెంట్‌ని స్పాన్సరింగ్ చేస్తుండడం చాలా గొప్ప విషయమన్నారు. బుక్ ఫెయిర్ నిర్వహణ ద్వారా పుస్తక పఠనంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతుందనీ, పుస్తక పఠనం ద్వారా సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవడంతోపాటు, సమాజం పట్ల అవగాహన పెంచుకోడానికి వీలవుతుందని, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని తెలుసుకోగలుగుతారని ప్రిన్స్ మిషాల్ చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ బుక్ ఫెయిర్ తెరిచి ఉంటుంది. సుమారు 70,000 మంది ఈ బుక్ ఫెయిర్‌కి వస్తారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







