బహ్రెయిన్‌లో నేషనల్ డే సెలబ్రేషన్స్
- December 17, 2016
బహ్రెయిన్‌లో నేషనల్ డే సెలబ్రేషన్స్
మనామా: బహ్రెయినీలు మరియు వలసదారులు దేశవ్యాప్తంగా జరిగిన బహ్రెయిన్ 45వ నేషనల్ డే వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కంపెనీలు, స్కూల్స్ ప్రత్యేకమైన కార్యక్రమాల్ని నిర్వహించాయి. సెలబ్రేషన్స్, యాక్టివిటీస్‌తో స్కూళ్ళు, సంస్థలు, స్ట్రీట్స్, కార్స్ డెకరేట్ చేయబడ్డాయి. 1971లో బ్రిటిష్ రూల్ నుంచి బహ్రెయిన్‌కి ఇండిపెండెన్స్ లభించింది. డిసెంబర్ అంతటా బహ్రెయిన్‌లో నేషనల్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. పలు ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఫైర్ వర్క్స్ డిస్‌ప్లే, కార్నివాల్స్, ఫెస్టివిటీస్ వంటివి జరుగుతాయి. ఈ సందర్భంగా కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మాట్లాడుతూ బహ్రెయిన్, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోందనీ, బహ్రెయిన్ యావత్ ప్రపంచానికీ మార్గదర్శకంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం లభించినప్పటిఉంచీ అరబిజమ్ మరియు ఇస్లామ్ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సహా పలువురు ప్రముఖులు బహ్రెయిన్ సమాజానికీ, బహ్రెయిన్ పాలకులకీ నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో ‘పేమెంట్ లింక్’ సేవకు త్వరలో ముగింపు..!!







