అమెరికా అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్లు
- December 17, 2016
వాణిజ్య సంబంధాల కోసం ఒకదేశం మరొక దేశంతో జతకట్టక తప్పదు. అది అగ్రరాజ్యమైనా, చిన్న చితక ప్రాంతమైనా. అమెరికా అయితే తన వాణిజ్య ఒప్పందాల విస్తరణకు మొదటి నుంచి ఎక్కువగా పాకులాడుతూ ఉంటోంది. ఏడాదికి అమెరికా ఇతర దేశాలతో దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల(రూ.3,39,22,475 కోట్ల) వాణిజ్యం చేస్తుందట. అమెరికాకు అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్లుగా చైనా, కెనడా, మెక్సికో లు దేశాలున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ దేశాలే దాదాపు 2 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతి, దిగుమతులు నిర్వహిస్తున్నాయట.
కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి అమెరికా వాణిజ్య సంబంధ రూపురేఖలన్నీ మారేలా కనిపిస్తున్నాయని వెల్లడవుతోంది.
చైనాపై ముందునుంచి ఆయన చూపిస్తున్న వ్యతిరేకత, వీసా నిబంధనల కఠినతరం వంటివి డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరుగబోయే ముఖ్యమైన మార్పులు. ట్రంప్ వైట్ హోస్ లోకి అడుగుపెట్టగానే ఉచిత వాణిజ్య ఒప్పందాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. టారిఫ్ లను అమలుచేస్తానని వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా అమెరికాకు టాప్ టెన్ ట్రేడింగ్ పార్టనర్స్ ఏ దేశాలు ఉన్నాయో ఓసారి చూద్దాం...
అమెరికా ఎగుమతులు....
- కెనడా............15 శాతం
- మెక్సికో.........11.9 శాతం
- చైనా..............7.3 శాతం
- యూకే............5.5 శాతం
- జపాన్............4.7 శాతం
- జర్మనీ.............3.5 శాతం
- దక్షిణకొరియా......2.8 శాతం
- బ్రెజిల్................2.7 శాతం
- నెదర్లాండ్స్.........2.5 శాతం
- స్విట్జర్లాండ్.........2.4 శాతం
అమెరికా దిగుమతులు.....
- చైనా..............18.2 శాతం
- కెనడా.............11.9 శాతం
- మెక్సికో..........11.6 శాతం
- జపాన్............5.9 శాతం
- జర్మనీ............5.7 శాతం
- యూకే............4.1 శాతం
- దక్షిణకొరియా.....3 శాతం
- ఇండియా........ 2.5 శాతం
- ఫ్రాన్స్..............2.3 శాతం
- ఐర్లాండ్.............2 శాతం
తాజా వార్తలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో ‘పేమెంట్ లింక్’ సేవకు త్వరలో ముగింపు..!!
- బైక్ చోరీ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష..!!
- కింగ్ ఖలీద్ విమానాశ్రయం పై బాలిస్టిక్ క్షిపణితో హూతీల దాడి
- చీటింగ్ చేస్తే ఇక వెంటనే చర్యలు లేవు.. IIT బాంబే కొత్త రూల్స్
- ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు







