స్టయిలీష్ విలన్ తో బాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్..
- December 17, 2016
స్టయిలీష్ విలన్ తో బాలీవుడ్ హీరోయిన్ రొమాన్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో రోజా, బొంబాయి.. చిత్రాలతో లవ్వర్ భాయ్ గా మారాడు అరవింద్ స్వామి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో స్టయిలీష్ విలన్ గా ఇరగదీస్తున్నాడు. తమిళ్ 'తని ఒరువన్', ఈ చిత్రం తెలుగు రిమేక్ 'ధృవ'లోనూ విలన్ గా హీరో కంటే అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో అరవింద్ స్వామి మళ్లీ హీరోగా మారబోతున్నాడు.
మళయాళ సూపర్ హిట్ చిత్రం 'భాస్కర్ ద రాస్కెల్' తమిళ్ రిమేక్ లో అరవింద్ స్వామి హీరోగా నటించబోతున్నారు. సిద్ధిఖీ దర్శకుడు. మొదట సూపర్ స్టార్ రజనీతో 'భాస్కర్ ద రాస్కెల్' రిమేక్ చేయాలని ప్రయత్నించారు.
రజనీ నో చెప్పడంతో ఆ అవకాశం అరవింద్ స్వామికి దక్కింది.
ఈ రిమేక్ లో అరవింద్ స్వామి సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాని నటింపజేయాలని ట్రై చేస్తునట్టు తెలుస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీ సరసన 'లింగా' చిత్రంలో నటించింది. మరీ.. ఇప్పుడు అరవింద్ స్వామి సినిమా కోసం సోనాక్షి 'ఎస్' అంటుందా.. ? లేదా.. ?? అన్నది ఆసక్తిగా మారింది. సోనాక్షి ఎస్ అంటే స్టయిలీష్ విలన్ తో ఫుల్ రొమాన్స్ లో మునిగిపోయినట్టే.. !
తాజా వార్తలు
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం







