సౌదీ అరేబియా దుకాణంలో మూడేళ్ల బాలుడిని కరిచిన తోడేలు
- January 01, 2017
నా పుట్టలో వేలు పెడితే ...కుట్టనా మరి అందట వెనకటికో చీమ... సౌదీ అరేబియాలో అభం శుభం తెలియని మూడు ఏళ్ల బాలుడు బుడి బుడి అడుగులు వేసుకొంటూ దుకాణంలో అఆకర్షణీయంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన తోడేలు బోనులో చేయి పెట్టి కుయ్యో మొర్రోమంటూ గగ్గోలు పెట్టాడు. అదృష్టవశాత్తు ఆ తోడేలు చిన్నారి బాలుడి చేతికి ఒక లోతైన గాయం చేసి వదిలిపెట్టడంతో ఆసుపత్రికి తరలించారు. ఈశాన్య, ఇరాకీ సరిహద్దు రాజ్యం అరర్ లో ఒక షాపింగ్ మాల్ లోపల అడవి జంతువును బంధించి ఒక బోనులో ఉంచారు. తన కుటుంబం పరాకుగా ఉన్న ఒక క్షణంలో ఆ బాలుడు తోడేలు బోను సమీపంలో ఆటలాడుకొనేందుకు అక్కడకి వెళ్ళి లోపలకు తన చేతిని పెట్టాడు...తోడేలు మరుక్షణం ఆ లేత చేతిని తన పదునైన పళ్లతో బలంగా లాక్కొని కసిగా కొరికిందని మాల్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. ఆ బాలునికి ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







