ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు 'గౌతమిపుత్ర శాతకర్ణి'..
- January 01, 2017
నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం సంక్రాంతి పండుగకు ముందు ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని విధాలా సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మించారు. బాలకృష్ణ వందో చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నూతన సంవత్సరారంభం రోజున నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ''బాలకృష్ణగారితో పనిచేయాలనే మా కల 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రయాణంతో నెరవేరింది. మొరాకోలో నిర్వహించిన తొలి షెడ్యూల్ నుంచి ఆయన మాకందించిన సహకారం మరవలేనిది.
శాతకర్ణి పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన అమోఘం. ఈ చిత్రానికి పనిచేస్తూ, ఆస్వాదించిన ప్రతి క్షణాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. బలమైన కథ, అసాధారణ అభినయాలు, పూర్తి బృందం ప్రదర్శించిన అంకితభావంతో అపురూపమైన దృశ్య కావ్యంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. నిజమైన సినిమా అనుభవాన్ని ఆస్వాదించేందుకు వెండితెరపైనే చిత్రాన్ని చూడండి.
శాతవాహన రాజుల్లోకెల్లా అత్యంత శక్తిమంతుడు, శూరుడైన శాతకర్ణి చరిత్రతో ఈ సంక్రాంతికి శుభారంభానిద్దాం'' అని వారు చెప్పారు. శ్రియ, హేమమాలిని, కబీర్ బేడి కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, సాహిత్యం: సీతారామశాసి్త్ర, సంగీతం: చిరంతన భట్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: బిబో శ్రీనివాస్.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







