బ్రిటన్ అంబాసిడర్ సర్ ఇవాన్ రోజర్స్ రాజీనామా
- January 03, 2017
మరికొన్ని నెలల్లో బ్రెగ్జిట్ చర్చలు ప్రారంభం కాబోతున్నాయనే తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యూరోపియన్ యూనియన్ కు బ్రిటన్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సర్ ఇవాన్ రోజర్స్ తన పదవికి రాజీనామా చేశారు. సర్ ఇవాన్ రోజర్స్ రాజీనామా చేసినట్టు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈయనకు యూకేలో అత్యంత అనుభవం కల్గిన యూరోపియన్ రాయబారిగా పేరొంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ చర్చలు అధికారికంగా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానున్నాయి. బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్స్ దశాబ్దం వరకు పట్టవచ్చని సర్ ఇవాన్ రోజర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం రివీల్ చేసి నెల తిరగక ముందే ఆయన రాజీనామా చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం గమనార్హం.
2013లో సర్ ఇవాన్ కు శాశ్వత ప్రతినిధి బాధ్యతను అప్పజెప్పుతూ ఆ దేశ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో ఈయన కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేశారు. కానీ ఆయన అనూహ్యంగా తన పదవి నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ కారణాలచే సర్ ఇవాన్ తన బాధ్యత నుంచి వైదొలుగుతున్నారో విదేశీ కార్యాలయం వెల్లడించలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







