పూరీ డైరెక్షన్లో నటించనున్న బాలకృష్ణ
- January 03, 2017
పూరీ డైరెక్షన్లో బాలకృష్ణ .. వినడానికే క్రేజీకాంబోగా ఉంది కదూ.. ఎట్ ప్రజెంట్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న ఫ్రెష్ గాసిప్ ఇది. నందమూరి వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత నూటొక్కటో మూవీ కృష్ణ వంశీ డైరెక్షన్ లో రైతు సినిమా కన్ఫాం చేశారు. అయితే ఇండస్ట్రీలో మారిన ఈక్వెషన్ల ప్రకారం నూటొక్కటో మూవీ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో నటించేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ న్యూస్.. ముందుగా ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్నా అది మిడిల్ డ్రాపయింది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ బాలకృష్ణను అప్రోచ్ అవ్వడం కథ వినిపించడం. దానికి బాలకృష్ణ ఓకే అనడం కూడా జరిగిపోయిందంటున్నారు. రైతు మూవీకి సంబంధించి షూటింగ్ పూర్తి కావాలంటే అమితాబ్ షెడ్యూల్ జూన్ వరకూ బిజీ. ఈ లోపే మరో సినిమాకు రెడీ అయిన బాలకృష్ణను బోయపాటి లాంటి కొంత మంది డైరెక్టర్లు కలవడం, వారిలో పూరీ కథ నచ్చడంజరిగిందనీ, అంతాబాగుంటే బాలకృష్ణ పూరీ జగన్నాధ్ లు కలిసి కొత్త సినిమాషురూ చేస్తారని టాక్..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







