ప్రయాణికుని ప్రేగులలో 90 హెరాయిన్ మాత్రలు..
- January 04, 2017
మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు ఇటీవల కడుపులోని ప్రేగులలో దాచి దేశాలను దాటించే యత్నాలు చేయించి ఇటీవల అడ్డంగా దొరికిపోతున్నారు. జజాన్ సరిహద్దు దళం ఒక అర టన్ను గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.సముద్రం ద్వారా కింగ్డమ్ తరలిస్తున్న ముగ్గురు అక్రమ రవాణాదారులను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. అలాగే, రియాద్ కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ ఏజెంట్లు దాదాపు ఒక కిలోగ్రాము స్వచ్ఛమైన హెరాయిన్ స్వాధీనం చేసుకొన్నారు. సరిహద్దు దళం మెరైన్ కల్నల్ సాహిర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బి ఈ సందర్భంగా మాట్లాడుతూ,జజాన్ ప్రాంతంలో సముద్ర గస్తీ జరుపుతున్న సమయంలో ఒక స్మగ్లింగ్ బృందం చేసిన ప్రయత్నంను తాము విజయవంతంగా నిలువరించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ ౩౧వ తేదీన అరా టన్నుకు పైగా గంజాయితో సౌదీ జలాల్లోనికి ప్రవేశించటానికి ప్రయత్నించిన ఒక చేపలను వేటాడే పడవ అనుమానించడం ద్వారా ఈ అక్రమ మాదక ద్రవ్యాల గుట్టు రట్టయినట్లు ఆయన తెలిపారు. వారి పడవను శోధించిన మరియు స్వాధీనం చేసుకున్నామని నిషిద్ధ మాదకద్రవ్యాలను జజాన్ సరిహద్దు దళం గుర్తించాయి. ఆ పడవలో ముగ్గురు ఏమినీలను అరెస్టు చేసి విచారణ కోసం పోలీసులకు అప్పగించనాట్లు తెలిపారు. రియాడ్ లో కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఒక అక్రమ రవాణాదారుడు తన కడుపులోని ప్రేగులలో హెరాయిన్ మాత్రలను దాచి మరో ప్రాంతానికి తరలించే యత్నంను అధికారులు అడ్డుకొన్నారు. కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ శాఖ డైరక్టర్ సుల్తాన్ అల్-ఫాహియెడహ్ మాట్లాడుతూ కింగ్డమ్ లోనికి ప్రవేశించిన ప్రయాణికులను క్షుణంగా తనిఖీలు జరుపుతున్నసమయంలో ఒక ప్రయాణికుడి కదలికలను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. ఆ ప్రయాణికుడిని పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్షలో తన ప్రేగులలో 708.6 గ్రాముల బరువున్న 90 హెరాయిన్ గుళికలు కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. దీంతో ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏదో విధంగా మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు విఫలయత్నం చేస్తున్నారని, అయితే సౌదీ కస్టమ్స్ శాఖ ఈ తరహా అక్రమ రవాణా వివిధ పద్ధతులు గుర్తించే సామర్ధ్యం తమ అధికారులు కలిగి ఉండే విధంగా వారు శిక్షణ పొందినట్లు అల్-ఫాహియెడహ్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







