ఫిలిప్పీన్స్లోని ఓ జైలుపై సాయుధులు దాడి..
- January 04, 2017
దక్షిణ ఫిలిప్పీన్స్లోని ఓ జైలుపై సాయుధులు దాడి చేయడంతో 150 మంది ఖైదీలు పరారయ్యారు. దాడికి పాల్పడిన సాయుధులు ఐఎస్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు భావిస్తున్నారు. మిందనావో ద్వీపంలోని నార్త్ కొటబాటొ జిల్లా జైలును పెద్ద సంఖ్యలో సాయుధులు చుట్టుముట్టి గార్డులు, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ గందరగోళంలో జైలులోని ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. కాల్పుల్లో ఒక గార్డు ప్రాణాలు కోల్పోగా మరో ఖైదీ గాయపడినట్లు తెలుస్తోంది. జైలులో 1500 మంది ఖైదీలు ఉన్నారని, రెండు గంటల పాటు కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. .
కాథలిక్ క్రైస్తవులు ఎక్కువగా ఉండే దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతం దశాబ్దాలుగా వేర్పాటువాదులతో పోరాడుతోంది.
జైలులో ఉన్న ఇస్లామిస్ట్ తీవ్రవాదులను విడిపించుకోవడం కోసమే ఈ దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిలిప్పీన్స్లో గత దశాబ్ద కాలంలో జైళ్లపై దాడిచేసి ఖైదీలను విడిపించుకున్న ఘటనల్లో ఇది మూడో అతి పెద్ద ఘటన.
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







