'శివలింగ' రిలీజ్ ఫిబ్రవరిలో...
- January 04, 2017
కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా, పి.వాసు దర్శకత్వంలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం" శివలింగ". ఇప్పుడు అదే"శివలింగ" పేరుతో తెలుగులో ఈ చిత్రం రీమేక్ అవుతొంది. లారెన్స్, రితికాసింగ్ జంటగా దర్శకుడు పి.వాసు ఈ సినిమాను తెరమీదకు తీసుకువస్తున్నారు. 30 కొట్ల భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగను తెరకెక్కిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా సింగిల్ ట్రాక్ ను శుక్రవారం యుట్యూబ్ లో విడుదల చెయనున్నారు. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ.. కథే హీరోగా కన్నడ లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం 'శివలింగ'. పి.వాసు గారి చంద్రముఖి, లారెన్స్ కాంచన , గంగ చిత్రాలను మించిన కథ, కథనాలతో హార్రర్ ఎంటర్ టైనర్ గా శివలింగ తెరకెక్కుతోంది .చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమన్ సంగీతాన్ని అందించిన సింగిల్ ట్రాక్ ను శుక్రవారం విడుదల చేయనున్నాము. త్వరలొ పాటలను, ఫిబ్రవరి లో సినిమాను విడుదల చెస్తాము. హార్రర్ కాన్సెప్ట్ ల పరంగా శివలింగ నెక్ట్స్ లెవెల్ లొ ఉండే చిత్రమని అన్నారు..
రాఘవలారెన్స్, రితిక సింగ్, వడివేలు, శక్తివాసు, రాధారవి, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సర్వేష్ మురారి. మ్యూజిక్ః ఎస్.ఎస్.థమన్, సాహిత్యంః రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్ః దురైరాజ్, ఫైట్స్ః అనల్ అరసు, దినేష్, ఎడిటింగ్ః సురేష్, నిర్మాతః రమేష్.పి.పిళ్లై , దర్శకత్వం : పి.వాసు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







