నేను హీరోను కాదు: అక్షయ్......
- January 05, 2017
ప్ర స్తుతం బాలీవుడ్ హీరోల్లో అక్షయ్‌కుమార్ మంచి దూకుడు మీదున్నాడు. గత కొన్నేళ్లుగా ఏడాదికి కనీసం మూడు, నాలుగు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా ఏడాదికి ఇన్ని సినిమాల్లో నటించడం వల్ల తనేమీ సూపర్‌హీరోని అయిపోను అని చెబుతున్నాడు.
''ఇండస్ట్రీలో చాలామంది సూపర్‌హీరోలు ఉన్నారు. వాళ్లలా నేను సూపర్ హీరో అవ్వాలని లేదు. హీరోగానే ఉండాలని అనుకుంటున్నా. వీలైనన్ని సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నా. అలాగే ప్రతి సీజన్‌లోనూ నా సినిమా విడుదలవ్వాలని ఆశిస్తున్నా.'' అని చెప్పుకొచ్చాడు అక్షయ్‌కుమార్.
సల్మాన్‌ఖాన్.. కరణ్‌జోహార్ నిర్మాతలుగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో అక్షయ్‌కుమార్ నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ చిత్ర విశేషాల గురించి అక్షయ్‌ని అడగ్గా.. '' ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా బాగా వస్తుందనే నమ్మకం ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని ఇప్పుడు నేను బయటపెట్టినా మా కాంట్రాక్టు రద్దయిపోతుంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని ఇప్పుడే చెప్పలేను.'' అన్నాడు అక్షయ్.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







