బహ్రెయిన్ జైలు లో తప్పించుకున్న ఖైది సామాజిక మీడియాలో దర్శనం
- January 05, 2017
మనామా: తప్పించుకున్న ఖైదీకి కాలం కలసి రాకపోతే..సామాజిక మాధ్యమం సైతం నిందితుడిని పోలీసులకు పట్టించేందుకు సహకరిస్తుందట..బహ్రెయిన్ జాజు జైలు నుండి తప్పించుకున్న భారీ నేపధ్యమున్న ఖైది ఒక కొత్త ఫోటోని పోస్ట్ చేస్తూ తన ఆచూకీ గురించి వివరిస్తూ ఓ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనితో ఎంచక్కా పోస్ట్ చేసి తనను వెతుకుతున్న పోలీసులకు పని సులువు చేశాడు బుధవారం (జనవరి 4 వ తేదీ ) నాడు రెద అల్ ఘస్ర ( 27 ) తన ఫోటోని పెట్టి , జైలు నుంచి నాలుగవసారి ఎలా తప్పించుకున్న తీరుని తన స్నేహితుల జాబితాలో ఉన్న వారికి వివరిస్తూ పోస్ట్ పెట్టాడు. అల్ ఘస్ర పది మంది ప్రముఖ నేరస్థులలో ఒకడు. ఆ నేరస్థునికి ఒక కేసులో 79 సంవత్సరాల పాటు జీవిత ఖైదు విధించబడింది. గత ఆదివారం జనవరి 1 వ తేదీన జాజు జైలు నుండి తప్పించుకున్నట్లు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెద అల్ ఘస్ర (27) సామాజిక మాధ్యమంలో ఫోటోని ప్రచురించడం ద్వారా దేశం వెలుపల ఉన్న అల్ ఘస్ర ఆచూకీ గురించి క్షణ్ణంగా విచారణ చేయడానికి తెరతీసింది. అంతర్గత వ్యవహారాల శాఖ దళాలు ఖైదీలను అరెస్టు విచారణ తీవ్రతరం చేశారు. 4 గురు నుండి 6 గురు సభ్యులు తీవ్రవాద కారాగారం నుంచి ఆటోమేటిక్ రైఫిల్స్ మరియు తుపాకి తో ఆయుధాలతో దాడి చేస్తూ నాలుగు రోజుల క్రితం ఆదివారం జనవరి1 వ తేదీన ఉదయం సుమారు 5:30 గంటలకు సంస్కరణ మరియు పునరావాస కేంద్రము ( జాజు ) మీద దాడిలో పాల్గొన్నాడు. ఈ దాడిలో అబ్దుల్స్లమ్ సైఫ్ అహ్మద్ అనే పోలీస్ మృతి చెందాడు. తీవ్రవాదుల దాడిలో ఎదుర్కునే సమయంలో రెండవ పోలీసుకు ఒక మోస్తరు గాయాలు తగిలాయి. పది మంది ఖైదీలు మునుపటి తీవ్రవాద కేసుల్లో దోషులు కాగా వారంతాతప్పించుకున్నారు.కమ్యూనిటీ భాగస్వామ్యంలో భాగంగా పౌరులు ,నివాసితులు పారిపోయిన నేరస్థుల సంమాచారం లేదా అనుమానిత వ్యక్తుల కదలికలు గురించి తమకు ఈ దిగువ 999 లేదా హాట్లైన్ను ౮౦౦౦౮౦౦౮ నంబర్లకు ఫోన్ చేయాలని అంతర్గత వ్యవహారాల శాఖ కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు అజ్ఞాతంగా ఉంచుతామని తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







