హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ లో కీలక మార్పులు....
- January 05, 2017
హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును మరోసారి అమెరికా చట్టసభ(కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఈ బిల్లును సభ ముందుకు తెచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ లో ఉల్లంఘనలకు కళ్లెం పడుతుందని ఇద్దరు సభ్యులు డారెల్ ఇసా, స్కాట్ పీటర్స్ అభిప్రాయపడ్డారు. అమెరికన్ల ఉద్యోగాలకు ఈ బిల్లు రక్షణ కల్పిస్తుందన్నారు.
హెచ్1బీ వీసా ఉన్నవారికి వారిక వేతనం కనీసం 10 లక్షల డాలర్లకు పెంచడం, మాస్టర్ డిగ్రీ మినహాయింపు రద్దు చేయడం లాంటి కీలక ప్రతిపాదనలు బిల్లులో ఉన్నాయి. విదేశీ ఉద్యోగుల స్థానే అమెరికన్లను అవకాశాలపై బిల్లులో దృష్టి సారించారు.అమెరికన్ల ప్రయోజనాలు కాపాడేందుకు విదేశీయుల ఉద్యోగ నిబంధనల్లో మార్పలు చేస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బిల్లు మరోసారి కాంగ్రెస్ ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







