రోడ్లు, భవనాలకు క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్
- January 06, 2017
దుబాయ్ మునిసిపాలిటీకి చెందిన సెంట్రల్ లేబరేటరీ, క్వాలిటీ కంట్రోల్ మరియు మానిటరింగ్ ప్రోగ్రామ్‌ని పలు రోడ్లు, భవనాలకు సంబంధించిన ప్రాజెక్టులపై చేపట్టనుంది. అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ కంట్రోల్ తరహాలో ఈ ప్రోగ్రామ్‌ని చేపడుతున్నారు. దుబాయ్ సెంట్రల్ లేబరేటరీ డైరెక్టర్ ఇంజనీర్ అమిన్ అహ్మద్ మొహమ్మద్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ మెటీరియల్ లేబరేటరీస్, ఫిజికల్ మెకానికల్ పరీక్షల్ని బిల్డింగ్ మెటీరియల్స్‌పై చేపడుతుందని, స్టీల్, టైల్స్, సిమెంట్, థర్మల్ ఇన్సులేషన్ ప్రోడక్ట్స్, మాయిశ్చర్ ప్రపూఫింగ్, పాలిస్టెరీన్, రోడ్లపై ఫ్లై యాష్, గ్లాస్ ఫైబర్ మరియు ప్లాస్టిక్ పైప్స్, రాక్ వూల్, గ్లాస్ వూల్, మోర్టార్ ప్రోడక్టులకు సంబంధించి పరీక్షలు జరుగుతాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయి నాణ్యతకి తగ్గట్టుగా ఇవి ఉన్నాయో లేవో పరీక్షించనున్నారు. 2016లో దుబాయ్, 288,000 పరీక్షల్ని నిర్వహించింది. అంతకు ముందుతో పోల్చితే ఈ పరీక్షలు 40 శాతం అదనం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







