'శాతకర్ణి' ప్రత్యేక ప్రదర్శనకు కేసీఆర్!...
- January 06, 2017
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రీమియర్ షోకు రావాల్సిందిగా ఆహ్వానించగా..కేసీఆర్ అంగీకరించారని బాలకృష్ణ తెలిపారు. .
'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రంపై కేసీఆర్ ముందు నుంచీ ఆసక్తి కనబరుస్తున్నారు.
బాలకృష్ణ ఆహ్వానం మేరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరై కొబ్బరికాయ కొట్టారు. తెలుగుజాతి గర్వించదగ్గ శాతకర్ణి కథను తెరకెక్కించడం గర్వకారణమంటూ బాలకృష్ణను అభినందించారు. దీంతో పాటు ఈ సినిమాను తొలుత తనకే చూపించాలని కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలోనే సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ..
కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







