5 స్టార్ ఎయిర్‌పోర్ట్స్ కేటగిరీలో హెచ్ఐఏ
- January 06, 2017
ఖతార్‌కి చెందిన హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్కైట్రాక్స్ ఫైవ్ స్టార్ ఎయిర్పోర్ట్ గౌరవాన్ని దక్కించుకుంది. ఆరు ఎయిర్‌పోర్టులకు ఈ ర్యాంకింగ్‌ని స్కైట్రాక్స్ అందించింది. మిడిల్ ఈస్ట్‌లో ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి ఎయిర్పోర్ట్ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడం గమనించదగ్గది. ప్రయాణీకులకు అత్యద్భుతమైన సౌకర్యాల్ని అందిస్తున్నందుకుగాను హెచ్ఐఏ ఈ గౌరవాన్ని దక్కించుకున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. కస్టమర్ సర్వీస్, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్, షాప్ ఔట్లెట్స్, ఫుడ్ మరియు బెవరేజ్ సౌకర్యాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని, ర్యాంకింగుల్ని ఇవ్వడం జరిగింది. ఈ కేటగిరీలో సింగపూర్, సియోల్, హాంగ్‌కాంగ్, టోక్యో - హనెదా మరియు మ్యునిచ్ ఎయిర్‌పోర్టులు 5 స్టార్ ర్యాంకింగుల్ని దక్కించుకున్నాయి. ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బాకర్ మాట్లాడుతూ, హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మోడర్న్ ఏరియాలో నిర్మితమైందనీ, ప్రయాణీకులకు అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







