జూన్ కి వాయిదా పడ్డ మహేష్ చిత్రం
- January 07, 2017
బ్రహ్మోత్సవం చిత్రం తో అభిమానులను నిరాశ పరిచిన మహేష్ బాబు , మురుగదాస్ తో చేస్తున్న చిత్రం పట్ల భారీ ఆశలే పెట్టుకున్నాడు..ఈ చిత్రం తో అభిమానుల ఆకలి తీర్చాలని మంచి కసిగా ఉన్నాడు. తెలుగు , తమిళ్ భాషలలో తెరకెక్కుతున్న ఈ మూవీ , ఇప్పటికే 70 % పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా జరుపుకున్న మహేష్ , ఇటీవలే హైదరాబాద్ చేరుకొని షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
ఇక మొదటి నుండి కూడా ఈ మూవీ రిలీజ్ ను ఏప్రిల్ లో చేయబోతున్నామని ప్రకటిస్తూ వస్తున్న చిత్ర యూనిట్ , తాజాగా ఆ డేట్ ను మార్చిందని సమాచారం..ఏప్రిల్ లో కాకుండా జూన్ 23 న విడుదల చేస్తారట . రంజాన్ కానుకగా సినిమాను విడుదల చేస్తే కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. సంక్రాంతి కి సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మూవీ లో మహేష్ కు జోడిగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుండగా , విలన్ గా ఎస్.జె. సూర్య నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







