ప్రపంచ అంధుల టి20 సెమీస్ హైదరాబాద్ లో..
- January 07, 2017
వచ్చే నెల 10వ తేదీన నగరంలోని ఎల్బీ స్టేడియంలో అంధుల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహక సంస్థ సమర్ధనం ట్రస్ట్ ఫర్ డిసేబుల్డ్ వ్యవస్థాపక ట్రస్టీ , క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా సభ్యుడు మహంతేష్ జీకే పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 28వ తేదీన ఢిల్లీలో ప్రారంభమయ్యే పోటీల్లో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు. .
ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహిస్తామని తెలిపారు.
భారత జట్టు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... దివ్యాంగులకు సానుభూతి కాకుండా అన్ని రంగాల్లో అవకాశాలు ఇచ్చి వారి సత్తాను వెలికితీయడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి , సమర్ధనం ట్రస్ట్ నిర్వాహకుడు సుబ్బు, కమిటీ సభ్యులు జెహరా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







