వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం: ముగ్గురు కార్మికుల మృతి..
- January 07, 2017
ముగ్గురు కార్మికులు ఓ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఘటన కల్బా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. ఓ ఫర్నిచర్ వేర్‌హౌస్‌లో ఈ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. అల్ వహ్దా ఫర్నిచర్ కంపెనీకి చెందిన వేర్‌హౌస్‌గా దీన్ని గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి చాలామంది కార్మికులు తప్పించుకున్నా, ముగ్గురు మాత్రం ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు షార్జా సివిల్ డిఫెన్స్ లెఫ్టినెంట్ కల్నల్ సమి ఖమ్సి అల్ నక్బి చెప్పారు. ఉదయం 8.46 నిమిషాల సమయంలో ప్రమాద సమాచారం తమకు అందినట్లు ఆయన వివరించారు. మంటల్ని ఆర్పివేసిన అనంతరం ప్రమాద స్థలిని షార్జా పోలీసులకు హ్యాండోవర్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







