హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మరిన్ని ఇ-గేట్స్..
- January 07, 2017
ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (హెచ్‌ఐఎ)లో మరికొన్ని ఇ-గేట్స్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లో పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో వీటి అవసరం మరింతగా పెరిగిందని ఖతార్ ఎయిర్ వేస్ సిఇఓ అక్బర్ అల్ బకర్ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎప్పటికప్పుడు ఇ-గేట్స్ సిస్టమ్‌ని అప్‌గ్రేడ్ చేసేందుకు వీలైనప్పుడల్లా భారీగా ఖర్చు చేస్తోందని అన్నారు. ఈ విధానం చాలా సమర్థవంతంగా పనిచేస్తోందనీ, యూజర్ డేటాని ప్రాసెసింగ్ చేయడానికి ఇ-గేట్స్ చాలా బాగా వేగంగా ఉపయోగపడ్తున్నట్లు తెలిపారు అక్బర్ అల్ బాకర్. రెసిడెంట్ ఎక్స్‌పాట్రియేటట్స్ ఉచితంగానే ఇ-గేట్ సర్వీసెస్‌ని వినియోగించుకోవడానికి వీలవుతోంది. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా 18 ఏళ్ళ పైబడినవారు ఇ-గేట్స్‌ని వినియోగించుకోగలుగుతున్నారు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద రద్దీని తగ్గించడానికి రెసిడెంట్స్ ఇ-గేట్స్‌ని వినియోగించుకోవాలని అబు అల్ బకర్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







