ఖైదీ నం.150 ఫంక్షన్లో దుమ్ములేపిన మెగాస్టార్ పంచ్ డైలాగులు
- January 07, 2017
ఖైదీ నం.150 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి పంచ్ డైలాగులు చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు. 'పొగరు నా ఒంట్లో ఉంది. హీరోయిజం నా ఇంట్లో ఉంది. కార్పొరేట్ బీరు తాగిన బాడీ నీది. కార్పొరేషన్ నీరు తాగిన బాడీ నాది. ఆఫ్టర్ ఏ గ్యాప్.. బాస్ ఈజ్ బ్యాక్' అని సినిమాలో ఓ సందర్భంలో వచ్చే డైలాగ్‌ను చిరు తన స్టైల్లో చెప్పినప్పుడు సభా ప్రాంగణం దద్దరల్లింది. సీనియర్ రచయిత సత్యానంద్‌తో కూడా తాను చర్చించి స్క్రిప్టు సహకారం తీసుకున్నానని, ఆయన ఈ సినిమాకి అజ్ఞాత వ్యక్తిగా పని చేశారని చిరంజీవి చెప్పారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఖైదీ నం.150 సంక్రాంతికి విడుదలవుతోంది. పండుగకు విడుదలవుతున్న ప్రతి సినిమా సూపర్ హిట్ కావాలని చిరంజీవి ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







