నాగ్-కార్తిక్ ల సినిమాకు టైటిల్ ఖరారు
- September 11, 2015
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల నిర్మాణం ఊపందుకుంటున్న నేపథ్యంలో.... నాగార్జున-కార్తీ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది.... రెండు భాషలకు చెందిన ఇద్దరు కథనాయకులు నటిస్తున్న ఈ మల్టీస్టారర్ ను పీవీపీ సంస్థ నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు... కార్తీకి జంటగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన మరోసారి మెరవబోతోంది అనుష్క. నాగార్జునకు మాజీ ప్రియురాలిగా అనుష్క పోషిస్తున్న పాత్ర చిన్నదే అయినప్పటికీ.... సినిమాకు చాలా కీలకమైన పాత్ర అని చెపుతున్నారు... ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలోకి రాగా.. తాజాగా ఓ టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఫ్రెంచ్ మూవీ 'ఇన్ టచబుల్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున వీల్ చైర్‌కి అంకితమయ్యే పేషెంట్‌గా నటిస్తుండగా.... నాగ్‌కి కేర్ టేకర్‌గా కార్తీ నటిస్తున్నాడు... ఈ సినిమాలో మెయిన్ థీమ్ వీరిద్దరి నడుమ ఫ్రెండ్ షిప్ కావడంతో... మిత్రులు, దోస్త్ వంటి టైటిల్స్ తెరపైకొచ్చాయి.... అయితే ఈ రెండు టైటిల్స్ ను కాదనుకున్న చిత్రయూనిట్.. ఊపిరి అనే టైటిల్ ను ఖరారు చేసింది... నాగార్జున నా ఊపిరి అనేలా కార్తీ పాత్ర ఈ సినిమాలో ఉండబోతోందట. అందుకే ఈ టైటిల్ ను నిర్ణయించినట్టు తెలుస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను నవంబర్ లో విడుదల చేసి.. నాగార్జునకు అచ్చి వచ్చిన డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. మరి ఎప్పటిలాగే ఈసారి కూడా డిసెంబర్ నెల నాగ్ కు కలిసొస్తుందేమో చూద్దాం..!
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







